ఓటు హక్కు వినియోగించుకోవాలి

Mar 13,2024 23:00
ఓటు హక్కు వినియోగించుకోవాలి

ప్రజాశక్తి-అమలాపురంఓటు హక్కు వజ్రాయుధం వంటిదని ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఓటు హక్కు విలువలు తెలుపుతూ ప్రచురించిన గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని సూచించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సిబ్బందికి ఓటు హక్కు వినియోగంపై అవగాహన నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటుకు ఎంతో విలువ ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు విలువను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధమన్నారు. నీ ఓటు, నీ భవిష్యత్తు అని నినదిస్తూ ఓటును అమ్ము కోవద్దు, నిస్వార్థంగా సేవలందించే వారిని ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోవాలని చెప్పారు. ఓటు అమ్ముకోవడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఒ వెంకటేశ్వర్లు, ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ సుబ్బరాజు, సాంఘిక సంక్షేమ బిసి సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️