క్షయ వ్యాధి నిర్మూలన అందరి బాధ్యత

Mar 23,2024 15:59

కేశవరం లో క్షయవ్యాధి అవగాహనపై ర్యాలీ

ప్రజాశక్తి-మండపేట

క్షయ వ్యాధి నిర్మూలన అందరి బాధ్యత అని వైద్యులు రమ్యశ్రీ అన్నారు. శనివారం మండలంలోని కేశవరం గ్రామంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ రెండు వారాల మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం తదితర లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాలన్నారు. ప్రస్తుతం మన దేశంలో ప్రతి సంవత్సరం 28 లక్షలు మంది క్షయ వ్యాధికి గురి అవుచున్నారు. ఏటా 13 లక్షలు చనిపోతున్నారు. భారత ప్రభుత్వం దీని నిర్మూలనకై ఈ కార్యక్రమాన్ని ఉదతం చేసిందన్నారు. క్షయ వ్యాధిని అంత మోదిందిద్దాం. అనే నినాదంతో 2025 కల్లా భారత దేశం క్షయ వ్యాది రహిత దేశంగా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆరోగ్య కార్యకర్తలు గహ దర్శనంలో భాగంగా క్షయ అనగా ఏమిటీ, వాటి లక్షణాలు, ఎలా నివారించే వచ్చు, క్షయ ఎలా వ్యాప్తిస్తుంది, క్షయ వ్యాధికి తీసుకొని జాగ్రత్తలు, గూర్చి తెలియ జేశారు. క్షయ వ్యాధిని అరికట్టుట ప్రతి ఒక్కరి కర్తవ్యం దీనిని అరికట్టేందుకు మనందరం భాగస్వామ్యం అవుదాం. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌ వైజర్స్‌, స్టాఫ్‌ నర్సులు, ఎం.ఎల్‌ హెచ్‌ పిలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు.

 

➡️