చేయూతతో మహిళలకు ఆర్థిక భరోసా

Mar 11,2024 23:21
చేయూతతో మహిళలకు ఆర్థిక భరోసా

ప్రజాశక్తి-రామచంద్రపురం, అయినవిల్లిజగనన్న చేయూత పథకంతో మహిళలందరికీ ఆర్థిక భరోసా లభించిందని వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పిల్లి సూర్యప్రకాష్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని క్రీడా ప్రాంగణంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాదంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మహిళలకు వైసిపి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. మహిళలకు అనేక సంక్షేమ పథకాలు రూపకల్పన చేసిన జగన్మోహన్‌ రెడ్డిని మహిళలందరూ మరొకసారి ఆశీర్వదించాలని కోరారు. సంక్షేమ పథకాలన్నీ మహిళలకే అందించటం గొప్ప విషయం అన్నారు. అనంతరం రూ. 7 కోట్ల 31 లక్షల 25 వేల చెక్కును చేయూత అర్హులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అంబటి భవాని, వైసిపి పట్టణ కన్వీనర్‌ గాదంశెట్టి శ్రీధర్‌, అంబటి నెహ్రూ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు చింతపల్లి నాగేశ్వరావు, కొలమూరి శివాజీ, కమిషనర్‌, శ్రీనివాసులు ఎంపిడిఒ రామచంద్రరావు పాల్గొన్నారు. అయినవిల్లి మండలంలో చేయూత చెక్కులను ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు, జెడ్‌పి చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎంపిపి మట్టపర్తి నాగవిజయలక్ష్మి, జెడ్‌పిటిసి గన్నవరపు శ్రీనివాసరావు, బొంతు రాజేంద్రప్రసాద్‌, వైసిపి మండల అధ్యక్షుడు కుడుపూడి విద్యాసాగర్‌, ఎఎంసి చైర్మన్‌ వేటుకూరి వెంకటరాజు, ఎంపిడిఒ మూర్తి పాల్గొన్నారు.

➡️