జొన్నాడ వద్ద వాహనాల తనిఖీ

Feb 15,2024 23:19

బిల్లులు పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అధికారులు

ప్రజాశక్తి – ఆలమూరు

రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా విజిలెన్స్‌ టీం ఆధ్వర్యంలో జొన్నాడ సెంటర్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద గురువారం వాహనాలను తనిఖీ చేసింది. సెస్‌ లేని వాటికి మార్కెట్‌ ఫీజు వసూలు చేశారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ఎం.గోవిందరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటిగా ఈ మండలం నుంచి తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో మార్కెట్‌ ఫీజు రూపంలో వివిధ వాహనాల నుంచి రూ. 9 వేలు వసూలు అయినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేట్‌ టు కార్యదర్శి వి.రామకృష్ణ, సూపర్‌వైజర్లు జి.బి.వరప్రసాదరావు, ఎం.లక్ష్మణరావు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వి.గంగాధర్‌ పాల్గొన్నారు.

 

➡️