డిమాండ్లు నెరవేర్చాలని జెఎసి నిరసన

Feb 15,2024 23:20

కొత్తపేటలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న జెఎసి

ప్రజాశక్తి-కొత్తపేట

డిమాండ్లు పరిష్కారం కొరకు గురువారం ఎపిజెఎసి రాష్ట్ర పిలుపుమేరకు జెఎసి కొత్తపేట తాలూకా యూనిట్‌ చైర్మన్‌ మోటూరి రామారావు ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కొత్తపేట తహశీల్దార్‌ కార్యాలయ ప్రాంగణ ములో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేశారు ఈ నిరసన ప్రదర్శన లో కొత్తపేట జెఎసి కో చైర్మన్‌ వై.సత్తిరాజు, కన్వీనర్‌ నల్లా వెంకట రామారావు, వైస్‌ ఛైర్మన్‌ లు కెపిసిఎచ్‌.సూర్యా రావు, ఆచంట రామచంద్ర ప్రసాద్‌, ఎవి. సుబ్బారావు, తుల్లూరు విజయకృష్ణ, జాయింట్‌ కన్వీనర్‌లు జి.రామ కుమార్‌, బి.శేష గిరిరావు, వై.మురళి, కోశాధికారి బి.నారాయణ , మరియు వివిధ సంఘాల కార్యవర్గ సభ్యులు,ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికులు పాల్గొన్నారు.

 

➡️