పల్స్‌ పోలియో పైఅవగాహనా ర్యాలీ

Mar 2,2024 19:08

లూటుకుర్రు పి హెచ్‌సి పరిధిలో అవగాహనా ర్యాలీ

ప్రజాశక్తి-మామిడికుదురు

లూటుకుర్రు పిహెచ్‌సి వైద్యాధికారులు డాక్టర్‌ డివి.సత్యం, డాక్టర్‌ స్పందన ఆధ్వర్యంలో శనివారం రాజోలు రోటరీ క్లబ్‌ పల్స్‌ పోలియోపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. పిహెచ్‌సి పరిధిలో అయిదేళ్ల లోపు పిల్లలు 3065మంది ఉన్నారని, 22 పోలియో బూత్‌ లు ఏర్పాటు చేశామని, 33 టీంలు నియమించామన్నారు. నగరం పిహెచ్‌సి పరిధిలో అయిదేళ్ల లోపు చిన్నారులు 3097మంది ఉన్నారని, 21 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశామని, 84 మంది సిబ్బందిని నియమించామని వైద్యాధికారులు డాక్టర్‌ పిజె.ప్రశాంత్‌, డాక్టర్‌ కె.స్వర్ణ లత తెలిపారు. విధిగా అయిదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

 

 

➡️