పారిశ్రామిక వేత్త పాపారావుకు సన్మానం

Feb 17,2024 17:24

పాపారావును సన్మానిస్తున్న కమిటీ సభ్యులు

ప్రజాశక్తి-ఆలమూరు

కలవచర్ల సీతారామ ఆలయ వార్షికోత్సవాల నేపథ్యంలో పారిశ్రామికవేత్త, మురళీకృష్ణ సంస్థల అధినేత, దాత వంటిపల్లి పాపారావు ఆలయ ఉత్సవ కమిటీకి శనివారం రూ. 40 వేలు విరాళంగా ఇచ్చారు. అలాగే ఆయన స్వామివారిని దర్శించుకున్నారు ముందుగా గ్రామ పెద్దలు పాపారావుకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ గ్రామ శ్రేయస్సు కొరకు మీరు చేసే సప్తాహ కార్యక్రమాలతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు, జీవరాశులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

 

➡️