పూడికతీతకు సన్నద్ధం కావాలి

Mar 15,2024 22:15

సమావేశంలో మాట్లాడుతున్న జెసి ఇతర ఉన్నతాధికారులు

ప్రజాశక్తి-అమలాపురం

కోనసీమ జిల్లా డెల్టా వ్యాప్తంగా పంట కాలువలు మూసివేసిన సమయంలో కాలువలు పూడికతీత పనులు ప్రారంభించే విధంగా ముందుగా ప్రతిపాదనలు మంజూరు చేయించుకుని పూడికతీతకు సన్నద్ధం కావాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి కమిటీ తీర్మానించిందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం కమిటీ సభ్యులతో నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుతగా గత సమావేశంలో తీర్మానిం చిన అంశాలపై వివిధ శాఖల వారీగా తీసుకున్న చర్యలను జిల్లా వ్యవసా య అధికారి కమిటీ కన్వీనర్‌ ఎ.బోసు బాబు సభ్యులకు వివరిం చారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ కమిటీ సభ్యులతో ఎంతో ఫలవం తమైన సుదీర్ఘంగా చర్చ జరిగిందని కమిటీ సభ్యులు పలు సమస్యలను కమిటీ దష్టి తెచ్చారని వాటి పరిష్కారం కొరకు ఆయా శాఖలు ప్రత్యేకమైన దష్టిని కేంద్రీకరించి రైతు సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని సూచించారు. రబీ సీజన్‌ ఆరంభంలో సాగునీరుకు గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకా శాలు ఉన్నాయని భావించినప్పటికీ గోదావరి పరివాహక ప్రాంతంలో పోలవరం బ్యారేజ్‌ వద్ద నీటి నిల్వలు సమద్ధిగా ఉన్న వాతావరణ ఏర్పడి సకాలంలో సాగునీరు సరఫరా కాబడి రబి సీజన్‌ పూర్తిగా గట్టెక్కిందని, అంతేకాకుండా రబీ సాగుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడంతో ఈ సీజన్లో దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉన్నాయని వైసిపి రైతు కమిటీ కార్యదర్శి కొవ్వూరి త్రినాథ్‌ రెడ్డి సభ దష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా రబీ సీజన్ను గట్టెక్కిం చేందుకు జలవరులశాఖ వ్యవసా య శాఖలు పూర్తి సమన్వయం వహించాయని వ్యవసాయ శాఖ విత్తనాలు ఎరువులు సకాలంలో సమకూర్చిం దని అదేవిధంగా పంట కాలువలు మూసివేసే సమయంలో పూడిక తీత పనులు ప్రారంభించా లని డెల్టా ఆధునీకరణ పనులు చేపట్టాలని ఈ సందర్భంగా సభలో తీర్మానించగా ఆయా అంశాలను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కమిటీ సమావేశంలో సభ్యుల ఆమోదంతో బలపరిచారు. అదేవిధంగా రబీ పంట చివరి దశలో ఉన్న సమయం లో పిల్లి పెసర, జనుము జీలుగు, వంటి పంటలు వేసుకునే విధంగా ఆర్బికేలు ద్వారా విత్తనాలు సరఫరా చేయాలని తద్వారా ఖరీఫ్‌ సీజన్‌ కు ఆ యొక్క పొలాల్లో ఆయా పంట లు సేంద్రియ ఎరువుగా ఉపయో గపడి రసాయన ఎరువులు వినియోగం పూర్తిగా తగ్గుతుందన్నా రు. లేదా అపరాల సాగుకు ప్రోత్సహించి మంచి దిగుబడులు పొందాల న్నా రు. రబీ సీజన్‌ ముగిసిన పిమ్మట ఆయా సాగు క్షేత్రాల్లో ఉన్నటువం టి వరిగడ్డిని స్టాబ్యానర్‌ పద్ధతిలో సేకరించి పశువుల కొరకు వినియోగించుకోవాలన్నారు ఎట్టి పరిస్థితులలోనూ పంట పొలాలలో వరిగడ్డికి నిప్పు అంటించరాదని నిప్పు అంటించిన పక్షంలో సాగు క్షేత్రాలలో సూక్ష్మ పోషకాలు పూర్తిగా నశించిపోయే ప్రమాదం ఉందని త్రినాధ్‌ రెడ్డి సూచించగా వీటిపై కూడా కమిటీ తీర్మానం చేసిందని జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. రబీ సాగును దిగ్విజయంగా పూర్తి చేయడంలో వ్యవసాయ జల వనరుల శాఖలు సమన్వయంతో రైతు సంక్షేమానికి పాటు పడ్డాయని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అభినందించారు. ధాన్యం సేకరణకు సంబంధించి ఆయా ప్రాంతంలోని మిల్లులే ఆ ప్రాంతంలో పండిన ధాన్యాన్ని సేకరించే విధంగా చర్యలు చేపట్టాలని లేని పక్షంలో రవాణా భారం పెరుగుతుందని కమిటీ సూచించగా అందుకు జెసి సమ్మతించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆర్‌బికెల వారీగా ఏర్పాటు చేసి పూర్తిస్థా యిలో కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అగ్రి మిషన్‌ సభ్యులు జిన్నూరి రామారావు, కమిటీ సభ్యులు రమేష్‌, వై.వెంకటేష్‌, వ్యవసాయ శాఖ ఎడిలు డ్రెయినేజీ డిఇ ఎంవి. కిషోర్‌, జలవనుల శాఖ డిఇ శ్రీనివాసరావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎస్‌.మధుసూదన్‌, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకట్రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

➡️