ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌

Feb 20,2024 22:58

మాకనపాలెంలో ప్రకృతి వ్యవసాయక్షేత్రాన్ని పరిశీలిస్తున్నజిల్లా వ్యవసాయాధి కారి బోసుబాబు

ప్రజాశక్తి -మామిడికుదురు

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ లో మంచి డిమాండ్‌ ఉందని జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు అన్నారు మంగళవారం మాకనపాలెంలో నైయినాల శ్రీరంగనాధం ప్రకృతి వ్యవసాయక్షేత్రంలో ట్రయివాన్‌ జామ, కోకో, పోక తదితర అంతర పంటలు పరిశీలించారు. ఈదరాడ లో యెరుబండి లక్ష్మయ్య, భాస్కర నాగేశ్వరరావు ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించారు. రైతులు ఎక్కువగా ప్రకృతి సేద్యం పై దృష్టి సారించాలన్నారు. ఈ ఉత్పత్తుల వినియోగం తో ఆరోగ్యవంతం గా జీవించ వచ్చాన్నరు ఆయన వెంట ఎఒ కె.శ్రీనివాస్‌, మండల వ్యవసాయాధికారి బి.మదుల, విఎఎ ఎస్‌.రమ్య, శ్రీలక్ష్మి, దినేస్‌, ఈదరాడ కేడర్స్‌ కె.జానకి, సిహెచ్‌.రాధ, కె.పద్మ, జి.లెనిన్‌, కె.స్వాతి నాగదుర్గ తదితరులు పాల్గొన్నారు.

 

➡️