బిసిలకు అండగా ఉంటా : ఎంఎల్‌ఎ వేగుళ్ల

Jan 28,2024 17:16

బాబు ష్యూరిటీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్‌ఎ

ప్రజాశక్తి-ఆలమూరు

నియోజకవర్గంలోని బిసిలం దరికీ తాను అండగా ఉంటానని, బిసిలంతా ఐక్యంగా ఉండి ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండలంలోని చినద్వారపూడి గ్రామంలో ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌ గ్యారంటీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొని టిడిపి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్బంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంఎల్‌ఎ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ఆదరణ పథకం ద్వారా బిసిలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందన్నారు. వైసిపి ప్రభుత్వం రూ.75 వేల కోట్ల బిసి సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్ళించి బిసిలకు తీరని అన్యాయం చేసిందన్నారు. బిసిలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. బిసిల అభ్యున్నతికి గత టిడిపి ప్రభుత్వం పాటుపడిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర, పార్లమెంట్‌, నియోజకవర్గ, మండల, గ్రామ స్ధాయి కమిటీ బి.సి నాయకులు పాల్గొన్నారు.

 

➡️