బౌద్ధ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ

Feb 12,2024 22:29
బౌద్ధ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ

ప్రజాశక్తి-రామచంద్రపురం విశాఖపట్నంలో ఈ నెల 25 నుండి జరిగే 11వ బౌద్ధ మహా సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని బుద్ధిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పిల్లి రాంబాబు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక చెలికాని రామారావు స్మారక భవనంలో సమ్మేళనం కరపత్రాల ఆవిష్కరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ ధార్మిక భావనలో బుద్ధుని బోధలు అత్యున్నతమైనవని, బౌద్ధ వైభవాన్ని పునరుద్ధరించాలన్న ధ్యేయంతో మహా సమ్మేళనాలను జరుపుతున్నామని తెలిపారు. బిఎస్‌ఐ న్యాయ సలహాదారుడు కె.భరత్‌ కుమార్‌ మాట్లాడుతూ బౌద్ధం, ప్రజ్ఞ, కరుణ, సమతలను బోధిస్తుందన్నారు. ఈ మూడు సిద్ధాంతాలు నేటి ప్రపంచానికి అత్యవసరమని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ తెలిపారన్నారు. అనంతరం బౌద్ధ సమ్మేళన కరపత్రాన్ని, భారతదేశ జాతీయ చిహ్నాలు, బౌద్ధం అనే క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పిల్లి మురళీ మోహన వెంకటరమణ, కార్యదర్శి వాడ్రేవు సాయిప్రసాద్‌, ఉపాధ్యక్షుడు పి.సత్యనారాయణ, యడ్ల కుటుంబరావు పాల్గొన్నారు.

➡️