మిడ్డే మిల్స్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Jan 29,2024 22:16
మిడ్డే మిల్స్‌ కార్మికుల సమస్యలు

ప్రజాశక్తి-కాట్రేనికోనమిడ్డే మీల్స్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద కార్మికులు సోమవారం ధర్నా చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ప్రతినెలా 5వ తేదీ లోపు కార్మికుల వేతనాలు చెల్లించాలని, గ్యాస్‌ను పూర్తిగా ప్రభుత్వమే సరఫరా చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెనూ ఛార్జీలు పెంచాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, వంట చేసేటప్పుడు ప్రమాదానికి గురైన కార్మికులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, రెండు జతల యూనిఫారం సమకూర్చాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు మండల అధ్యక్షుడు విప్పర్తి మోహన్‌ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మిడ్డే మీల్స్‌ మండల నాయకురాలు బొంతు పార్వతి, గుత్తుల కనకదుర్గ, సత్యవతి, ఇసుకపట్ల వీరమ్మ, సుభద్ర, సుశీల, రమావతి, నాగలక్ష్మి, సరస్వతి పాల్గొన్నారు.

➡️