మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డికి సన్మానం

Jan 30,2024 17:04

రామచంద్రపురం మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌రెడ్డిని సన్మానిస్తున్న విఆర్‌ఒలు

ప్రజాశక్తి-రామచంద్రపురం

రామచంద్రపురం మున్సిపల్‌ కమిషనర్‌ గా సేవలందించిన శ్రీకాంత్‌ రెడ్డి గుడివాడకు బదిలీ అయ్యారు . ఆయనకు వీడ్కోలు పలుకుతూ పట్టణ విఆర్‌ఒలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విఆర్‌ఒల సంఘం నాయ కులు మద్దాల బాపూజీ మాట్లాడుతూ 10 శాఖల కు చెందిన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని అందులో ముఖ్యంగా రెవెన్యూ శాఖ చెందిన విఆర్‌ఒల విధుల పట్ల వివక్షకు తావు లేకుండా శ్రీకాంత్‌ రెడ్డి ఎంతో సహకరించారని కొనియాడారు. కార్యక్రమంలో రామచంద్రపురం డివిజన్‌ సంఘం ఉపాధ్యక్షులు పి. సాయి ప్రతిమ, పట్టణ అధ్యక్షులు ఎన్‌.శేఖర్‌, కార్యదర్శి సత్యవతి, గౌరవ అధ్యక్షులు చీకట్ల వీరాంజనేయులు, ఉపాధ్యక్షులు ఎన్‌ సత్యనారాయణరెడ్డి, సహాయ కార్యదర్శి చిక్కాల మానస, కోశాధికారి సీతా మహాలక్ష్మితో పాటు కనకదుర్గ, నర్మదా, శిరీషా, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

 

➡️