రంజాన్‌ తోఫా పంపిణీ

Mar 31,2024 17:56

రంజాన్‌ తోఫా అందుకుంటున్న ముస్లిం

ప్రజాశక్తి-మండపేట

స్థానిక సప్తగిరి ఆక్సా మసీదు వద్ద అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌ ట్రస్ట్‌ అవరణలో ఆదివారం చైర్మన్‌ మౌలానా పేద ముస్లింలకు నిత్యావసర కిట్ల రంజాన్‌ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ముస్లిం ఆనందంగా రంజాన్‌ వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు. ఆకలి దప్పికలతో సాటి వారి కష్టాలు తెలుసుకొనే అవకాశం రంజాన్‌ ఉపవాస దీక్ష ద్వారా తెలుస్తుందన్నారు. జిల్లా నూర్‌ బాష్‌ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్‌ ఇబ్రహీం మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన ద్వారా మానసిక ఒత్తిడి జయించవచ్చనన్నారు. మరో పది రోజుల్లో ఈ మాసం పూర్తి అవుతుం దన్నారు. ఈ నెల నేర్పిన పాఠాలు ఏడాది అంతా పాటిస్తే జీవన సరళిలో పెను మార్పులొస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ సెక్రటరీ షేక్‌ చిన్న బాదుల్లా, కార్యవర్గ సభ్యులు షేక్‌ మౌలాలి, షేక్‌ మహబూబ్‌ బాషా, తదిదరులు పాల్గొన్నారు.

 

➡️