రైతుల పోరాటంపై కేంద్ర వైఖరికి నిరసన

Feb 14,2024 22:40

కార్మిక, వ్యవసాయంకార్మిక, ప్రజాసంఘాల నిరసన

ప్రజాశక్తి-అమలాపురం

ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అణిచివేయడం కోసం, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా రైతు కార్మిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అమలాపురం గడియార స్తంభం సెంటర్‌ వద్ద బుధవారం నిరసన తెలియజేశారు కార్యక్రమంలో ఎఐటియుసి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కె.సత్తిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పోరేట్లకు రెడ్‌ కార్ప్ఱెట్లు పర్చి ఆహ్వానం పలుకుతూ దేశానికి వెన్నుముక అన్నదాత రైతులను ముల్లకంచెలు వేసి నిర్బంధాన్ని ప్రయోగించడం అత్యంత నీచమైన చర్యని అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ ఉద్యమం నేపథ్యంలో మోడీ ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతును నిండా ముంచి హామీలను అమలు చేయకుండా వందలాది మంది రైతులకు ప్రాణాలు బలిగొన్న నరేంద్ర మోడీ రాబోయే కాలంలో మూల్యం చెల్లించక తప్పదని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు వ్యవసాయ కార్మిక, కార్మిక సంఘాల నాయకులు పెద్దిరెడ్డి రాము, గడ్డం ప్రభాకర్‌ రావు, చెల్లుబోయిన తాతారావు, నిమ్మకాయల శ్రీను, కె.రామకృష్ణ, జంపన ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️