విద్యార్థులకు చెక్కుల పంపిణీ

Feb 6,2024 17:17

చెక్కులు అందజేస్తున్న తూర్పుగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌ భరత్‌

ప్రజాశక్తి-ఆత్రేయపురం

ఆత్రేయపురం మహాత్మా గాంధీ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న పేద మెరిట్‌ విద్యార్థులకు మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ సి ఎస్‌ ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ రాజమహేంద్రవరం ఆనంద రెసిడెన్సులో విమెన్‌ ఎంపవర్మెంట్‌ కు 42 విద్యార్థిని లకు మంగళవారం తూర్పుగోదావరి జిల్లా జెసి సిఎం తేజ్‌ భరత్‌ ముఖ్య అతిథిగా పాల్గొని స్కాలర్షిప్‌ చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ సి ఎస్‌ ఆర్‌ వారు బాలికల విద్యాభివద్ధికి, నిరుపేదలకు గహ నిర్మాణం, హంగర్‌ స్ట్రైక్‌ అరికట్టడం మరియు ఓల్డ్‌ ఏజ్‌ హౌమ్స్‌ నిర్వహించడం లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలన్నారు, కళాశాల సెక్రటరీ అండ్‌ కరెస్పాండెంట్‌ మాట్లాడుతూ విద్యార్థినిలకు స్కాలర్షిప్‌ ఉపయోగపడుతుందని ఈ మొత్తాన్ని అందించిన మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ సిఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ వారికి కతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ బివిఆర్‌, స్టోర్స్‌ మెయిన్‌ హెడ్‌ ఈశాంత్‌ మహమ్మద్‌, వెంకట్‌, ప్రవీణ్‌, విగేష్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️