వెంకటరామయ్య సేవలు అభినందనీయం

Mar 19,2024 23:28

ఉద్యోగ విరమణ చేసిన వెంకటరామయ్యకు సత్కారం, పాల్గొన్న కుటుంబసభ్యులు తదితరులు

ప్రజాశక్తి-మండపేట

మండలంలోని ద్వార పూడిలోని జడ్‌.మేడపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ముఖ్య కార్యనిర్వహణ అధికారి తోట వెంకట రామయ్య అందించిన సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం గ్రామంలోని ప్రైవేట్‌ కన్వెన్షన్‌ హాల్లో రామయ్య ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు, గ్రామ సర్పంచ్‌ ఈతకోట కిన్నెర, డిసిసిబి ఛైర్మన్‌ ఆకుల వీర్రాజు, డిసిసిబి సిఇఒ ఆర్‌వి.నరసింహారావు, జిల్లా సహకార అధికారి మురళీకష్ణ, జిల్లా సహకార ఆడిట్‌ అధికారి రాధాకృష్ణ, సిఐటియు జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి తదితరులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 38 సంవత్సరాల్లో సంఘాన్ని అభివద్ధి పథంలో నడిపించిన ఆయన పలువురికి ఆదర్శమన్నారు. తొలుత వెంకట్రామయ్య దంపతులను పూలమాలతో ఘనంగా సత్కరించి మెమెంటోలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామ, యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

 

➡️