వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రారంభం

రామచంద్రపురం హైస్కూల్లో ఏర్పాటుచేసిన జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలోటిఎల్‌ఎంలను తిలకిస్తున్న జిల్లా జెసి

ప్రజాశక్తి-రామచంద్రపురం

పట్టణంలోని కృత్తివెంటి పేర్రాజు పంతులు హైస్కూల్లో శుక్రవారం జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన టిఎల్‌ఎంలు అందరినీ ఆకట్టుకున్నాయి.అనంతరం డిఇఒ ఎం.కమలకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నూపుర్‌ అజరు మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వమే పరిశోధనలకు పునాది అవుతుందని అన్నారు. రోజువారి జీవితం ప్రతి ఒక్కరికి సైన్స్‌ తో ముడిపడి ఉందన్నారు శాస్త్రీయ పరిశోధనలో సృజనాత్మకత దాగి ఉంటుందన్నారు. నూతన ఆవిష్కరణలు బాల శాస్త్రవేత్తలు నుంచే ప్రారంభమవుతాయన్నారు.డిఇఒ కమలకుమారి మాట్లాడుతూ రెండు రోజుల పాటు ప్రదర్శనలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లావ్యాప్తంగా 93 ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నామని అన్నారు జిల్లా సైన్స్‌ అధికారి గిరిజాల వెంకట సత్య సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంలు, సైన్స్‌ ఉపాధ్యాయుల సహకారంతో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతంగా నిర్వహిస్తున్నా మన్నారు. జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు వ్యక్తిగత, ఉపాధ్యాయ విభాగాల్లో ప్రాజెక్టులను రూపొందించి ప్రదర్శించారు. జెసి ప్రాజెక్టులనుతిలకించి విద్యార్థులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. రామచంద్రపురం ఆర్‌డిఒ ఎఎస్‌.సుధా సాగర్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ గాదంశెట్టి శ్రీదేవి, అమలాపురం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రెడ్డి నాగేంద్రమణి, రామచంద్రపురం ఎంపిపి అంబటిభవాని, కౌన్సిలర్లు అమ్మాజీ, కేతాసుజాత, నల్ల అంజమ్మ, రామచంద్రపురం ఉప విద్యాశాఖ అధికారి శ్రీపాద నరసింహ ఫణి, డిసిఇబి సెక్రెటరీ హనుమంతరావు, సమగ్ర శిక్ష సిఎంఒ బివివి.సుబ్రహ్మణ్యం, ఎఎంఒ పిల్లి రాంబాబు, మండలవిద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️