సరిహద్దు ప్రాంతాల చెక్‌పోస్టుల వద్ద నిఘా

Jan 23,2024 23:10

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డిఆర్‌ఓ సత్తిబాబు

ప్రజాశక్తి-అమలాపురం

పార్లమెంట్‌, శాసనసభకు త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటర్లను అన్ని విధాలుగా ప్రలోభాలకు గురి చేసే మద్యం, నగదు, విచ్చలవిడిగా రవాణా కాకుండా సరిహద్దు ప్రాంతాల చెక్‌ పోస్టుల వద్ద గట్టి నిఘా వ్యవస్థలను అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్‌.సత్తిబాబు సంబం ధిత అధికారులకు సూచించారు. మంగళ వారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ఉన్నత అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి ఎన్నికల నిర్భంద నిర్వహణ వ్యవస్థ శిక్షణ పై 26 జిల్లాల అధికారులతో మద్యం, నగదు, లిక్కర్‌ బల్కుగా రవాణా కాకుండా తీసుకోవాల్సిన సాంకేతిక అంశాలపై అవగాహన పెంపొందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి సత్తిబాబు మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు శిక్షణ ద్వారా పొందిన సాంకేతికతను అన్వయించుకుని పూర్తి అవగాహనతో ఓటర్లను వివిధ రకాలుగా ప్రలోభాలకు గురి చేసే అంశాలపై ప్రత్యేక దష్టిని కేంద్రీకరిం చాలన్నారు. బ్యాంకర్లు బల్క్‌గా నగదు విత్‌ డ్రా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. వాణిజ్య పన్నుల శాఖ చెక్‌ పోస్ట్‌ ఓటర్లను ప్రభావితం చేసే రీతిలో బల్బుగా గిఫ్ట్‌ గా ఇచ్చే వెండి, బంగారం ఆర్టికల్స్‌ రవాణా కాకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎస్‌ఇబి అధికారులు మద్యం బల్కు రవాణాపై దృష్టి పెట్టాలన్నారు. అటవీ చెక్‌ పోస్ట్‌ ల వద్ద కూడా ఓటర్లను ప్రభావితం చేసే బహుమతుల బల్క్‌ రవాణా అంశాలపై నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు చేసిన తనిఖీల ద్వారా నిర్భందించిన వివరాల ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌ కోసం కమిషన్‌ ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెం ట్‌ సిస్టమ్‌ ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కార్యక్ర మంలో వాణిజ్య పన్నులు లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ కె.శ్యాంబాబు, ఎస్‌ఇబి అధికారులు, ఎక్సైజ్‌ తదితర శాఖలకు చెందిన అధికారులు, డిఎఫ్‌ఒ ఎంవి ప్రసాదరావు, కలెక్టరేట్‌ సెక్షన్‌ అధికారి పి.సుబ్రహ్మణ్యం, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి కాశీ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️