సావిత్రీబాయి ఫూలేకు ఘన నివాళి

Mar 10,2024 17:13

ద్రాక్షారామంలో సావిత్రీబాయి ఫూలే వర్ధంతి

భారతీయసంఘ సంస్కర్త, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే దంపతుల విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులుఅర్పించారు.

ప్రజాశక్తి-యంత్రాంగం

రామచంద్రపురం సావిత్రీబాయి పూలే 127 వ వర్ధంతిని ద్రాక్షారామలో నియోజకవర్గ మైనార్టీ బిసి సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ద్రాక్షారామ మసీద్‌ సెంటర్‌ లో గల పూలే దంపతులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యాట్ల మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సత్యశోధక్‌ సమాజ్‌ ను స్థాపించి శ్రామిక మహిళా సాధికారిత అనేది సావిత్రీబాయి ఫూలేతో ాధ్యమైందని. తన భర్త పూలే తో కలిసి 1841జనవరి 1న పూణే లో మొదటి మహిళా పాఠశాల ప్రారంభించారని తెలిపారు. సావిత్రిబాయి పూలే త్యాగాలను ప్రభుత్వం గుర్తించి ఆమె జయంతి రోజును జనవరి 3న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని, ఆమెకు భారతరత్న బిరుదు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు మగాపు అమ్మిరాజు, కానీల వీరభద్రరావు, కొత్తపల్లి దుర్గా ప్రసాద్‌, వేమవరపు రాంబాబు, షావుకారు శివయ్య, సూదంశెట్టి గంగాధర్‌, కొండేటి రామకష్ణ, రాజాన గోవింద్‌, మెడిశెట్టి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. మండపేట తొలితరం ఉపాధ్యాయురాలు, మహిళల విద్యా హక్కుల కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన మహిళా ఉద్యమకారిణి సావిత్రీబాయి ఫూలే వర్ధంతి జాతీయబిసి సంఘం ఆద్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆమె సమాజ అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు పిల్లి శ్రీనువాస్‌, కోన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️