సైన్స్‌పై విద్యార్థులకు అవగాహన

Mar 29,2024 23:29

రిటైర్డ్‌ శాస్త్రవేత్త రామమూర్తికి సన్మానం

ప్రజాశక్తి-రామచంద్రపురం

సైన్స్‌ యొక్క ప్రాధాన్యతను, మానవుని జీవితంలో సైన్స్‌ యొక్క పాత్రపై విద్యార్థులకు అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. పట్టణంలోని మోడరన్‌ విద్యాసంస్థలు వేదికగా విద్యాసంస్థల అధినేత లయన్‌ జివి.రావు అధ్యక్షతన శుక్రవారం ఈ సదస్సు నిర్వహించారు. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఏర్పాటుచేసిన ‘దేశ అభివృద్ధిలో ఇస్రో పాత్ర’ పై పలువురు ప్రసంగించారు. నేషనల్‌ రిమోటింగ్‌ సెన్సింగ్‌ సెంటర్‌ విశ్రాంత శాస్త్రవేత్త రామమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధిలో ఇస్రో పాత్ర ఎంతో కీలకమన్నారు. మన శాస్త్రవేతల కృషిని విద్యార్థులు గ్రహించాలన్నారు. ప్రత్యేక అతిథిóగా హాజరైన రేవతి ఫౌండేషన్‌ అధ్యక్షులు కె. కృష్ణసాయి, విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి అంటే విజ్ఞాన శాస్త్రమును శాస్త్రీయ దృష్టితో అధ్యయనం చేయాలన్నారు. అనంతరం జివి.రావు మాట్లాడుతూ సైన్స్‌ సమాజానికి దిక్చూచి దానిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్‌ విద్యార్థులు మోడరన్‌ సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️