సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం

Feb 18,2024 22:44

 

ప్రజాశక్తి-ఆత్రేయపురం

అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదవానికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ద్వేయమని స్థానిక ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రం ఆత్రేయపురం లో ఆత్రేయపురం, ఉచ్చిలి, వసంతవాడ, వెలిచేరు, తాడిపూడి గ్రామాల344 మంది మహిళలకు ఆ, పసుపు కుంకుమ, రవిక, గాజులతో ఇళ్ల పట్టాలను ఎంఎల్‌ఎ అందజేశారుఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ నియోజ కవర్గంలోని నాలుగు మండలాల్లో అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు 17 వేలకు పైగాని ఇళ్లపట్టాలు అందజేశామని అన్నారు. పేదలందరికీ రూ.లక్షల విలువైన ఇళ్ల పట్టాలు అందచేసి వాటిని రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యురాలు బోనం సాయిబాబా ఎంపిపి కుండా అన్నపూర్ణ, మండల వైసిపి కన్వీనర్‌ కనుమూరు శ్రీనివాసరాజు, ముదునూరి రామరాజు తదితరులు పాల్గొన్నారు.

 

➡️