16న గ్రామీణ బంద్‌ జయప్రదానికి పిలుపు

Feb 14,2024 22:39

సమావేశంలో పాల్గొన్న కార్మిక, ప్రజాసంఘాల నాయకులు

ప్రజాశక్తి-అమలాపురం

దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16న తలపెట్టిన గ్రామీణ బంద్‌, పారిశ్రామిక శ్రమను జయప్రదం చేయాలని కార్మిక, ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. అమలాపురం స్థానిక వడ్డిగూడెంలోని కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. సమావేసానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరావు అధ్యక్షుడు వహించారు ఎఐటియుసి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కెసత్తిబాబు మరియు వెంకటేశ్వర మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా మోసగిస్తుందన్నారు వ్యవసాయం, పరిశ్రమలు గనులు విద్యుత్‌, అటవీ సంపదలను, రవాణా, బ్యాంకులు, ఎలసి తదితర సంస్థలన్నిటిని అదానీ, అంబానీ తదితర కార్పొరేట్‌ కంపెనీలకు అప్పచెప్ప చూస్తుంది. కార్పొరేట్‌ కంపెనీల లాభాలకు ఆటంకంగా ఉన్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కార్మిక కోడ్లు తెచ్చింది దీనికి నిరసనగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు పారిశ్రామిక శ్రమను జయప్రదం చేయాలన్నారు. రైతాంగ ఉద్యమానికి తలవంచి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసిన మరొక రూపంలో వాటిని అమలుపరచాలని చూస్తుందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని రైతు, కార్మిక ప్రజా అనుకూల విధానాలకై పోరాడాలని, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్‌ మోర్చాలు పిలుపు ఇచ్చాయన్నారు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్‌ నిర్వహించాలని, పరిశ్రమల అన్నింటిలో కార్మిక సమ్మె జరపాలని నిర్ణయించాయి. అని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, అసోసియేషన్లు, ఫెడరేషన్లు, వినియోగదారుల సంఘాలు, వృత్తి సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన, మహిళా,సాంస్కతిక సంఘాలు గ్రామీణ బంద్ను పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. డిమాండ్లు ఇవి.. రైతుల రుణాలు మాఫీ చేయాలి, కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టం చేయాలని, నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని తదితర డిమాండ్లను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో రైతు వ్యవసాయ కార్మిక కార్మిక సంఘాల నాయకులు పెద్దిరెడ్డి రాము, గడ్డం ప్రభాకర్‌ రావు, చెల్లిబోయిన తాతారావు, నిమ్మకాయల శ్రీను, కె.రామకష్ణ, జంపన ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️