పట్టణంలో ‘బాబు ష్యూరిటీ

Apr 17,2024 22:20

కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్‌ఎ వేగుళ్ల

ప్రజాశక్తి-మండపేట

మండపేట పట్ట ణంలో రాజీవ్‌ గృహకల్పలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమంలో బుధవారం నిర్వహించారు. మాజీ మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ చుండ్రు శ్రీవర ప్రకాష్‌, పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు టిడిపి శ్రేణులతో కలసి ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు ఇంటింటా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసమర్ధ వైసిపి పాలనకు ప్రజలు చమర గీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ఓటర్లకు తెలియజేశారు. ప్రస్తుత ఈ అసమర్ధ వైసిపి ప్రభుత్వం సంపద సష్టించలేకపోయిందని విమర్శించారు. సానుభూతి కోసం జగన్‌ ఎన్ని వేషాలు వేసినా నమ్మే స్ధితిలో ఎవరూ లేరని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో తన డ్రామాలతో, సానుభూతితో ఓట్లు పొందాలనే సిఎం జగన్‌ ఆలోచనలకు ప్రజలు అంతే స్థాయిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి ఎంఎల్‌ఎ గా తనను, ఎంపీగా గంటి హరీష్‌ మాథూర్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

➡️