4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌

Jul 2,2024 22:33

పోస్టర్‌ విడుదల చేసిన పిడిఎస్‌యు విద్యార్థి సంఘం నాయకులు

ప్రజాశక్తి-రామచంద్రపురం

జూలై 4న దేశ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌ ను జయప్రదం చేయాలని పిడిఎస్‌ యు విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. దీనిపై స్థానిక కృతివెంటి పేర్రాజు పంతులు జూనియర్‌ కాలేజీలో మంగళవారం పోస్టర్‌ విడుదల చేశారు. పిడిఎస్‌యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ మాట్లాడుతూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహిం చడంలో విఫలమైందన్నారు. బాధ్యతా రాహిత్యంతో పరీక్షలు నిర్వహించారని, నీట్‌ పరీక్షా లీకేజ్‌ కుంభకోణం, నీట్‌ స్కామ్‌పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. జులై 4న తేదీన దేశ వ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల బంద్‌ ఐక్య విద్యార్ధి సంఘాలు తలపెట్టేయన్నారు. అన్నీ విద్యా సంస్థల యాజమాన్యాలు బంద్‌ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో రామచంద్రపురం పిడిఎస్‌యు డివిజన్‌ నాయకులు డి.హరీష్‌, ఎం.రాజేష్‌, ఆర్‌. భాను ప్రకాష్‌, వి.నాగ దుర్గా హనుమాన్‌, జి.తరుణ్‌ సాయి, అభిలాష్‌ తదితరుల పాల్గొన్నారు. విజయవాడ లో జరిగిన పిడిఎస్‌యు రాష్ట్ర జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం లో బత్తుల సిద్ధూను పిడిఎస్‌యు రాష్ట్ర సహాయ కార్యదర్శి గా ఎన్నుకున్నారు.

 

➡️