ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు

May 23,2024 18:28

సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

ప్రజాశక్తి-అమలాపురం

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు చేపట్టినట్లు, జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అమరావతి నుంచి 26 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు విడివిడిగా ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల సన్నద్ధతపై జిల్లాల వారీగా సమీక్షించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాల నందు స్ట్రాంగ్‌ రూములను మూడంచెల భద్రత నడుమ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికా రుల ఉద్దేశించి మాట్లాడుతూ జూన్‌ నెల 4న శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాల నందు ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లు పటిష్టం చేయాలని ఆదేశించారు. కౌంటింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ సిబ్బంది శిక్షణలను ఎన్నికల సంఘం మార్గ దర్శకాల ప్రకారం చేపట్టాలని ఆదేశించారు. స్ట్రాంగ్‌ రూములకు పక్కనే ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. లెక్కింపు కేంద్రాల్లో పూర్తిస్థాయి వసతులను కల్పించ డంతోపాటు సిసి కెమెరాల నిఘాలో కౌంటింగ్‌ ప్రక్రియను పూర్తిగా చిత్రీకరించాలని ఆదేశించారు. అదేవిధంగా కౌంటింగ్‌ ఏజెంట్లకు పరిశీలకులకు సిటింగ్‌ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. జూన్‌ 4న ఉదయం 8 గంటల నుంచి అమలాపురం పార్లమెంటు, నియోజకవర్గం, అమలాపురం అసెంబ్లీ, ముమ్మిడి వరం అసెంబ్లీ, పి.గన్నవరం అసెంబ్లీ, రాజోలు అసెంబ్లీ, కొత్తపేట అసెంబ్లీ, మండపేట అసెంబ్లీ, రామచంద్రపురం అసెంబ్లీ స్థానాలకు వెరసి డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఒక పార్లమెంటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, సంబంధించి ఇవిఎంలలో నిక్షిప్త మైన ఓట్లను లెక్కించనున్నారన్నా రు. లెక్కింపునకు అనువుగా అన్ని రకాల ఏర్పాట్లు ఈనెల 25 నాటికి పూర్తి చేయాలన్నారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ఓట్లను లెక్కిస్తారని తదుపరి ఉదయం 8 గంటల నుంచి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలలో ఓట్ల లెక్కింపు ప్రారం భమవుతుందన్నారు పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజక వర్గాలవారీగా వేర్వేరుగా ఓట్ల లెక్కింపు జరగనుందన్నారు. ఆర్‌ఒ, ఎఆర్‌ఒ పర్యవేక్ష ణలో ఓట్ల లెక్కింపు చేస్తారన్నాయరు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తయిన పిదప ఇవిఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొంటార న్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గదిలో ఒక రిటర్నింగ్‌ అధికారి పర్యవేక్షణలో ఒక ఎఆర్‌ఒ, గెజిటెడ్‌ హోదా కలిగిన ఒక కౌంటింగ్‌ సూపరింటెండెంట్‌, ఒక సహాయకుడు, ఒక మైక్రో అబ్జర్వర్‌, ఇవిఎంలను అందజేసేందుకు ఇద్దరు విఆర్‌ఒలను నియమించడంతో పాటుగా వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థుల తరఫు న కౌంటింగ్‌ ఏజెంట్లు లెక్కింపు కేంద్రంలో ఉంటారన్నారు. ప్రతి రౌండ్‌ వారీగా ఫలితాలు వెల్లడిస్తారనిఆయన తెలిపారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియలో సిబ్బంది అలసత్వం ప్రదర్శించకూడదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సిబ్బందిని కేటాయించాలని సూచించారు. విద్యుత్‌ అంతరాయాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు . లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రం ప్రహరీ చుట్టూ వంద మీటర్లు వరకు బారికేడింగ్‌ ఏర్పాటు చేయా లని ఆదేశించారు. వంద మీటర్ల లోపలికి ఏ వాహనాన్ని అనుమ తించకూడదన్నారు. పార్కింగ్‌ ప్రదే శాలలోనే వాహనాలు పార్కింగ్‌ చేయాలన్నారు. ప్రధాన ద్వారం వద్ద పోలింగ్‌ ఏజెంట్లు, అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించాలన్నారు. నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు ముందుగానే కౌంటింగ్‌ ఏజెంట్లకు, అభ్యర్థులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని సూచించారు. కౌంటింగ్‌ రోజు నిర్వహించాల్సిన విధివిధానాలపై అభ్యర్థులకు, ఏజెంట్లకు పూర్తిస్థాయి అవగాహనను కల్పించాలన్నారు.ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఎటువంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా భద్రత చర్యలు పోలీస్‌ యంత్రాంగం ద్వారా పటిష్టం చేసుకోవాలన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున జూన్‌ 6వ తేదీ వరకు ఎటు వంటి ర్యాలీలు ఊరేగిం పులు నిర్వహించరాదని, బాణసంచా కాల్చేందుకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు, రిటర్నింగ్‌ అధికారులు వి.మదన్‌ మోహన్‌రావు, ఎస్‌.సుధా సాగర్‌, జివివి సత్యనారాయణ, జి. కేశవర్ధన్‌రెడ్డి, డివిఎస్‌.ఎల్లారావు, డిఆర్‌డిఎ పీడీ వి.శివశంకర్‌ ప్రసాద్‌, ఐసిడిఎస్‌ పీడీ ఝాన్సీ రాణి, ఎన్నికల సెక్షన్‌ సూపరింటెండెంట్‌ టి. వైద్యనాథ్‌ శర్మ, ఎఒ సిహెచ్‌.వీరాంజనేయ ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️