ప్రాథమిక పాఠశాల్లో గ్రాడ్యుయేషన్‌ డే

Apr 16,2024 23:49

పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-మండపేట

స్థానిక సంగమేశ్వర కాలనీ ప్రాథమిక విద్యను ముగించి ఉన్నత పాఠశాల విద్యలో అడుగు పెడుతున్న విద్యార్ధులందరికీ గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమ ముఖ్యఅతిథిగా ఎంఇఒ చింత వెంకట సోమిరెడ్డి మాట్లాడుతూ విద్యార్ధులు క్రమశిక్షణతో మెలిగి జీవితంలో ఉన్నతశిఖరాలను అధిరోహిం చాలన్నారు. అనంతరం ప్రాథమికోన్నత విద్యలో రాటుదేలితేనే ఉన్నత విద్యాభ్యాసం తేలికవుతుందని చెప్పారు. ప్రాథమిక విద్యను ముగించుకున్న విద్యార్ధులకు వారి తల్లిదండ్రులచే గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్స్‌ అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మొదటి రెండవ తరగతి విద్యార్ధుల నత్యప్రదర్శన తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ముత్యాల మాణిక్యంబ, ఉపాధ్యాయులు, వెంకట శ్రీధర్‌. శేషారత్నం, పి ఎం సి చైర్మన్‌ క్రాంతి, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

➡️