18 నుంచి నామినేషన్ల ప్రక్రియ

Apr 16,2024 23:43

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

ప్రజాశక్తి -అమలాపురం

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారు లు నామినేషన్‌ పత్రాలు దాఖలు పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పట్ల సంపూర్ణమైన అవగాహనతో ఎక్కడ పొరపాటులకు తావులేకుండా నిర్వహించాలని స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఈ నెల 18వ తేదీ నుంచి స్వీకరించనున్న నామినేషన్ల ప్రక్రియ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, నో డ్యూస్‌ పత్రాలు జారీ, అభ్యర్థుల డిపాజిట్‌ చెల్లింపు అంశాలపై సమీక్షించారు. ఈ సంద ర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ నేర చరిత్ర క్రిమినల్‌ కేసులు ఉన్న అభ్యర్థులు తమ యొ క్క కేసులు వివరాలను మూడు సార్లు ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మాధ్యమాలలో స్పష్టంగా కనిపించే విధంగా ప్రచురితమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థి చేత ప్రతిజ్ఞ చేయించాలని తదుపరి సంబంధిత రిటర్నింగ్‌ అధికారి ప్రతిజ్ఞ చేసినట్లు తేదీ సమయం రాసి అభ్యర్థి తో సంతకం చేయించి అభ్యర్థికి ఆ యొక్క సర్టిఫికెట్‌ అందించాలన్నారు. నామి నేషన్ల పరిశీలన సమయంలో అభ్య ర్థి సమర్పించిన అన్ని సేట్ల నామినేషన్లను తప్పనిసరిగా పరిశీలన చేయాలన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఆకలింపు చేసుకొని నామినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్వోలను ఆదేశించారు. కార్యక్ర మంలో జిల్లా జెసి, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్ని

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

➡️