నూకాంబిక దర్శనానికి పోటెత్తిన యాత్రికులు

Apr 9,2024 23:09

ఆలయంలో యాత్రికుల రద్దీ

ప్రజాశక్తి-ఆలమూరు రూరల్‌

మండలంలోని చింతలూరు నూకాంబిక అమ్మవారి దర్శనానికి ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం యాత్రికులు పోటెత్తారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో క్యూలైన్లలో భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.ఉగాది వేడుకలలో భాగంగా అమ్మవారి సన్నిధిలో ఆలయ కార్య నిర్వహణాధికారి ఎం.శివరామకష్ణ, జూనియర్‌ అసిస్టెంట్‌ భాస్కర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. సిఐ రామకుమార్‌, ఎస్‌ఐ శ్రీను నాయక్‌ ఆధ్వర్యంలో అణువణువునా పటిష్టమైన భద్రత ఏర్పాటుచేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షణ చర్యలు చేపట్టారు. అలాగే నియోజకవర్గ వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి, టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి ఎంఎల్‌ఎ అభ్యర్థి బండారు సత్యానందరావు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్‌ బండారు శ్రీనివాస్‌, తదితర నాయకులు వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

 

➡️