అతి త్వరలో ప్రజాపాలన

May 2,2024 23:12

కాట్రేనికోన గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టిడిపి అభ్యర్థి దాట్ల

ప్రజాశక్తి-కాట్రేనికోన

అతి త్వరలోనే ప్రజాపాలన రాబోతుందని కూటమి బలపరిచిన ముమ్మిడివరం నియోజకవర్గం టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. అయిదేళ్ల విధ్వంసకర జగన్‌ పాలన నుంచి విముక్తి పలికేందుకు ఈనెల 13న జరగబోయే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటువేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని సుబ్బరాజు ఓటర్లను కోరారు. మండల పరిధిలోని కాట్రేనికోన పంచాయతీ ఉన్న గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని గురువారం దాట్ల సుబ్బరాజు నిర్వహించారు. తొలుత చిలకా చెరువు వద్ద నుంచి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ అభ్యర్థి సుబ్బరాజు మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే విధ్వంసం మొదలయ్యిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భత్రలకు వైసిపి పాలనలో తీవ్ర విఘాతం కలిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ అరాచక పాలన పోయేందుకు ఈ ఎన్నికల ద్వారా ప్రతీ ఒక్కరూ చైతన్యవంతులై ఓటుహక్కును వినియోగించుకుని సైకిల్‌ గుర్తుకు ఓటు వేయలన్నారు. అంథకారంలోకి వెళ్లిపోతున్న రాష్ట్ర భవిష్యత్తును తిరిగి మరలా గాడిలో పెట్టేందుకు ఉమ్మడి కూటమి ప్రభుత్వ పాలన అత్యవసరమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ముమ్మిడివరం నియోజకవర్గాన్ని మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగిడి నాగేశ్వరరావు, నడింపల్లి సుబ్బరాజు, పిఎస్‌ఎన్‌.రాజు, చేకూరి రాజా, దాట్ల పవన్‌, ఎస్‌విఎస్‌.రవి, టిడిపి, జనసేన, నాయకులు, జన సైనికులు, వీరమహిళలు, అభిమానులు పాల్గొన్నారు.

 

➡️