అత్యాచార నిందితుని శిక్షించాలి

Jan 13,2024 19:47

సమావేశంలో విజయ భాస్కర్‌ గౌడ్‌

– టిడిపి మండల కన్వీనర్‌ విజయ భాస్కర్‌ గౌడ్‌
ప్రజాశక్తి- దేవనకొండ
మండలంలోని పి.కోటకొండ గ్రామంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన బోయ ముని రంగడును కఠినంగా శిక్షించాలని టిడిపి మండల కన్వీనర్‌ విజయభాస్కర్‌ గౌడ్‌, టిడిపి నాయకులు బడిగింజల రంగన్న, ఉచ్చీరప్ప, మాలిక్‌ డిమాండ్‌ చేశారు. శనివారం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇలాంటి ఘటనలతో మానవత్వం మంటకలిసుపోతోందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టిడిపి నాయకులు డీలర్‌ బండ్లయ్య, మస్తాన్‌, మాజీ ఎంపిటిసి వెంకటేష్‌, రాజశేఖర్‌ గౌడ్‌, రాజగోపాల్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

➡️