గోనెగండ్లలో రైతు సదస్సు

Jan 29,2024 19:39

స్టాల్స్‌ ప్రదర్శిస్తున్న విద్యార్థులు

– నమూనా స్టాల్స్‌ ప్రదర్శించిన వ్యవసాయ విద్యార్థులు
ప్రజాశక్తి – గోనెగండ్ల
గోనెగండ్లలోని మండల పరిషత్‌ సమావేశ భవనంలో బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాకు చెందిన వ్యవసాయ కళాశాల విద్యార్థులు సోమవారం రైతు సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్‌ సుజాత, ఎమ్మిగనూరు ఎడిఎ ఖాద్రీ హాజరయ్యారు. విద్యార్థులు తయారుచేసిన సమీకృత వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, హైడ్రోఫోనిక్స్‌ ద్వారా సాగునీటి కుంటలు, వర్షపు నీటిని ఆదా చేయడం తదితర అంశాలతో కూడిన స్టాల్స్‌ను బనవాసి కేంద్రం సమన్వయకర్త పరిశీలించారు. తయారు చేసిన నమూనాలపై వ్యవసాయ విద్యార్థులు అధికారులకు, రైతులకు వివరించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్‌ చందన, డాక్టర్‌ శ్రీదేవి, సహాయ ఆచార్యులు దివాకర్‌ రెడ్డి, ఎఒ హేమలత పాల్గొన్నారు.

➡️