జగన్‌కు గుణపాఠం చెప్పే రోజులొచ్చాయి

Jan 5,2024 20:44

ప్రజలతో మాట్లాడుతున్న శ్రీనివాస్‌ రెడ్డి

– టిడిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌ రెడ్డి
ప్రజాశక్తి – మంత్రాలయం
జగన్‌ అరాచక పాలనకు గుణపాఠం చెప్పే రోజులు వచ్చాయని టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని వి.తిమ్మాపురం గ్రామంలో రెండోరోజూ ఇంటింటికీ తిరిగి ‘బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ’ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోలో పలు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కస్లర్‌ ఇన్‌ఛార్జీ ఎల్లా రెడ్డి, నాయకులు అబ్దుల్‌, రాగప్ప, హరిశ్చంద్ర రెడ్డి, కేశన్న, దావీదు, రాము, జగ్గయ్య, హనుమేష్‌, లింగప్ప, గోపాల్‌, దస్తగిరి పాల్గొన్నారు.

➡️