పనుల్లేక కూలీల వలస బాట

Jan 5,2024 20:39

గుంటూరుకు బయల్దేరిన గంజిహళ్లి కూలీలు

ప్రజాశక్తి – గోనెగండ్ల
మండలంలో వ్యవసాయ పనులు ముగియడంతో చేసేందుకు పనుల్లేక మండలంలోని వివిధ గ్రామాల నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సీజన్లో అరకొర వర్షాలకు రైతులు సాగు చేసిన పంటలు తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పూర్తిగా నష్టపోయాయి. మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ కూలీలు చేసేందుకు పనులు లేక వలస బాట పడుతున్నారు. మండలంలోని గంజిహల్లి, బైలుప్పల, అగ్రహారం గ్రామాలతో పాటు గోనెగండ్లలోని మొట్టి వీధికి చెందిన ప్రజలు ఉపాధి కోసం గుంటూరు, విజయవాడ, ప్రకాశం, కడప జిల్లాలతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. శుక్రవారం గంజిహళ్లి గ్రామానికి చెందిన చెందిన 20 కుటుంబాల వ్యవసాయ కూలీలు, గోనెగండ్లలోని మొట్టివీధికి చెందిన మరో 20 కుటుంబాలు రెండు బొలెరో వాహనాల్లో మిరపకాయల కోతలకు బయల్దేరారు. వర్షాభావం వల్ల పంటలు దెబ్బతినడంతో పాటు వ్యవసాయ పనులు ముగియడంతో తాము మిరపకాయల సుగ్గికి వెళ్తున్నామని వారు తెలిపారు.

➡️