ప్రజల సంక్షేమమే జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యం

Dec 18,2023 19:50

ప్రజలకు వివరిస్తున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

– ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
ప్రజాశక్తి – కౌతాళం
బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తెలిపారు. సోమవారం కౌతాళం సచివాలయం-2 పరిధిలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ నిర్వహించారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఆయన సతీమణి జయమ్మ ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా, లేదా, ఇంకా ఎవరైనా అర్హులై ఉంటే వారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని వివరించారు. విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయాలని, వికలాంగులకు సదరన్‌ క్యాంపు ఏర్పాటు చేసి పింఛన్లు అందించాలని, రోడ్లు వేయాలని ప్రజలు వారి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చారని తెలిపారు. ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతుండడంతో ప్రజలు జగన్మోహన్‌ రెడ్డి పాలనను మళ్లీ కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజల కోసం ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో, రాబోయే ఎన్నికల్లో వారికే పట్టం కట్టాలని, జగన్మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. వైసిపి మండల కన్వీనర్‌ దేశాయి ప్రహ్లాద చారి, సర్పంచి పాల్‌ దినకరన్‌, వైస్‌ ఎంపిపి బుజ్జి స్వామి, ఉప సర్పంచి తిక్కయ్య, వైసిపి నాయకులు అవతారం, చౌదరి బసవరాజు, సుబ్బరాజు, రాఘవేంద్ర రెడ్డి, వడ్డే రాముడు, భీమేష్‌, వెంకటరామరాజు, అబ్దుల్‌ సమద్‌, ఎంపిడిఒ సుబ్బరాజు పాల్గొన్నారు.

➡️