మతిభ్రమించి మాట్లాడిన చంద్రబాబు

Jan 29,2024 19:42

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి

– ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి
ప్రజాశక్తి – ఆదోని
అక్రమాలకు పాల్పడుతున్నామని తనపై, తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు మతిభ్రమించి ఆరోపణలు చేస్తున్నారని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి మండిపడ్డారు. కల్లు బావి వీధిలో సోమవారం ‘గడపగడపకు మన ప్రభుత్వం’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదివారం పత్తికొండలో జరిగిన బహిరంగ సభలో లేనిపోని ఆరోపణలు చేయడం బాబు దిగజారుడు తనానికి నిదర్శమని విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఆడవారు అని కూడా చూడకుండా తమ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. అక్రమాలకు కేరాఫ్‌గా చంద్రబాబు ఉండడం వల్లనే 54 రోజులు జైలులో ఉన్నారని, అలాంటి వ్యక్తి తమ కుటుంబానికి అవినీతి మరకలు అంటించడం శోచనీయమని తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే ఆరోపణలు నిరూపించి చిత్తశుద్ధి చాటుకోవాలని సవాలు విసిరారు. పేదల కష్టాల్లో నుంచి పుట్టిన వైసిపి ప్రజా శ్రేయస్సు కోసమే పని చేస్తోందన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. జగన్మోహన్‌ రెడ్డిని 2024లో మరోసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ బోయ శాంత, మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి, వైసిపి పట్టణ అధ్యక్షులు దేవా, వార్డు ఇన్‌ఛార్జీ మాధవరెడ్డి, వీరభద్ర రెడ్డి, రవి రెడ్డి, రేణుక, మంజుల, భాను, కౌన్సిలర్లు రాజేశ్వర్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ స్వామి, మల్లి, శ్రీలక్ష్మి, నల్లారెడ్డి, చంద్రకాంత్‌ రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌లు నరసింహులు, ఎంఎంజి.గౌస్‌, సర్దార్‌, నాగరాజు, సాయన్న, నారి, నాగేంద్ర, ముని, షేక్షావలీ, సుగుణమ్మ, గిరి, రవి రెడ్డి, ఎర్రి స్వామి, మస్తాన్‌, బాపురెడ్డి ఉన్నారు.

➡️