రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఉపాధ్యాయుడు

Dec 18,2023 19:45

విజయకుమార్‌ను అభినందిస్తున్న సిబ్బంది

– అభినందించిన హెచ్‌ఎం, పాఠశాల సిబ్బంది
ప్రజాశక్తి – గోనెగండ్ల
ఈనెల 6న కర్నూలులో నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఉపాధ్యాయ విభాగంలో గోనెగండ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన జీవశాస్త్ర ఉపాధ్యాయులు విజరు కుమార్‌ ప్రతిభ చూపి జిల్లాలో ప్రథమ స్థానం సాధించి, రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యారు. సోమవారం విజరుకుమార్‌ను ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విజరు కుమార్‌ తయారు చేసిన బోధనోపకరణాలు సైన్స్‌ అంశాలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునే విధంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో కూడా ఆయన విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. గుమ్మల బాబు, జె.ఉస్మాన్‌, ఈరన్న, రంగస్వామి, అబ్దుల్‌ సలీం, రాజేష్‌, మహబూబ్‌ బాషా పాల్గొన్నారు.

➡️