విద్యార్థులకు ముగ్గుల పోటీలు

Jan 5,2024 20:34

బహుమతులు అందజేస్తున్న ప్రధానోపాధ్యాయులు

ప్రజాశక్తి – హోళగుంద
మండలంలోని వందవాగిలి మండల పరిషత్‌ ప్రాథమికోన్నత కన్నడ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పాఠశాల పిసి ఛైర్మన్‌ భీమ లింగప్ప, వైసిపి నాయకులు మేలిగిరి, ప్రధానోపాధ్యాయులు హెచ్‌వై.శేషాద్రి, ఉపాధ్యాయులు కలాం బాష, ఎన్‌.ఈరన్న, సుమిత్రబాయి, కె.జంబునాథ, తెలుగు పాఠశాల నుంచి సుమలత, నాగవేణి పాల్గొన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు ప్రధానోపాధ్యాయులు శేషాద్రి బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల పిసి ఛైర్మన్‌, వైసిపి నాయకులు మేలిగిరి విద్యార్థులకు భోజనాలు వడ్డించారు.

➡️