వైసిపి హయాంలో పింఛన్ల జాతర

Jan 5,2024 20:36

నందవరంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి

– ఎమ్మెల్యే ఎర్రకోట
ప్రజాశక్తి – నందవరం
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతేడాది జనవరిలోనే పింఛన్ల జాతర మొదలవుతోందని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని ఇబ్రహీంపురం గ్రామంలో సర్పంచి నాగేశ్వర్‌ రెడ్డి అధ్యక్షతన పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్రకోట మాట్లాడారు. జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచుతూ పోతున్నారని, జనవరి నుంచి రూ.3 వేల అందిస్తున్నట్లు తెలిపారు. అందరికీ సంక్షేమ పథకాలు అందడంతో ముఖ్యమంత్రి జగన్‌ను, వైసిపి ఇన్‌ఛార్జీ మాచాని వెంకటేష్‌ను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. వైసిపి సీనియర్‌ నాయకులు లక్ష్మీకాంత్‌ రెడ్డి, ముగతి సర్పంచి విరుపాక్షి రెడ్డి, ప్రధాన కార్యదర్శి పేట శ్రీనివాస్‌ రెడ్డి, తహశీల్దార్‌ నిత్యానంద రాజు, ఎంపిడిఒ దశరథ రామయ్య, ఎపిఎం వీరన్న, ఎస్‌ఐ తిమ్మయ్య, వైసిపి నాయకులు డీలర్‌ రాముడు, శంకరప్ప, ప్రకాష్‌ రెడ్డి, చాంద్‌ పాల్గొన్నారు. ఆస్పరి మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో వైసిపి ఆలూరు ఇన్‌ఛార్జీ గుమ్మనూరు నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరై పింఛన్లు పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని, ఆలూరు ఎమ్మెల్యేగా గుమ్మనూరు జయరామ్‌ను గెలిపించాలని కోరారు. సొసైటీ ఛైర్మన్‌ గోవర్ధన్‌, కెడిసిసి బ్యాంకు డైరెక్టర్‌ రాఘవేంద్ర, సర్పంచి మూలింటి రాధమ్మ, వైసిపి మండల కన్వీనర్‌ పెద్దయ్య, మాజీ కన్వీనర్‌ రామాంజనేయులు, సిఇఒ అశోక్‌, కో కన్వీనర్‌ పురుషోత్తం రెడ్డి, ఎంపిడిఒ రాణెమ్మ, సర్పంచి హరికృష్ణ, ఎంపిటిసి శ్రీరాములు పాల్గొన్నారు.

➡️