సంక్షేమం, అభివృద్ధి చేసి చూపిస్తాం

Dec 23,2023 19:44

సమావేశంలో మాట్లాడుతున్న మల్లప్ప

– జనసేన ఇన్‌ఛార్జీ మల్లప్ప
ప్రజాశక్తి – ఆదోని
జనసేన, టిడిపి పొత్తును ఆశీర్వదిస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి చూపిస్తామని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జీ ఎన్‌.మల్లప్ప తెలిపారు. శనివారం ఆదోనిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పులి రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మల్లప్ప మాట్లాడారు. నియోజకవర్గంలో వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు వాట్సాప్‌ నెంబర్‌ 7799666581కి సమస్యను ఫొటో తీసి పంపాలని, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. జనసేన పార్టీకి మద్దతు తెలిపి, కలిసి నడవాలి అనుకునే వారు పూర్తి వివరాలు పంపాలని చెప్పారు. అభిప్రాయాలతో పాటు సలహాలు, సూచనలు తీసుకొని ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. జనసేన మండల అధ్యక్షులు ఎం.తాహేర్‌ వలీ, పట్టణ అధ్యక్షులు రేణు వర్మ, నాయకులు రాజశేఖర్‌, చంద్రశేఖర్‌, జయరామ్‌, నెల్లిబండ రాజశేఖర్‌, అయ్యప్ప, దాసప్ప, రాకేష్‌, వెంకటరాముడు, శాంత, ప్రకాష్‌, అజరు, శ్యామ్‌, గోపాల్‌, ఈరన్న, బంగారయ్య, మల్లికార్జున, నాగప్ప, వీరేష్‌, నరసన్న, గోవిందు, రాము, మౌలా, ఖాదర్‌, తరుణ్‌ పాల్గొన్నారు.

➡️