అంగన్వాడీ సమ్మెకు ఆవాజ్ మద్దతు 

Dec 31,2023 17:37 #Kurnool
anganwadi workers strike 20th day kurnool awaz

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : అంగన్వాడీ ఉద్యోగులతమ సమస్యల పరిష్కారం కోసం గత 20 రోజులుగా సమ్మె చేస్తున్న వారికి ఆవాజ్ నగర కమిటీ తమ సంపూర్ణ మద్దతు తెలియజేసిందని ఆవాజ్ నగర కమిటీ కార్యదర్శి షేక్. మొహమ్మద్ షరీఫ్ తెలియజేశారు. కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ లో తమ సమస్యల పరిష్కారం కోసం గత 20 రోజులుగా నిరాహార దీక్షలో ఆందోళనలు పోరాటాలు చేస్తున్నప్పటికీ వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చీమ కుట్టినట్టు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆవాజ్ నగర కమిటీ గౌరవ అధ్యక్షులు ఇస్మాయిల్ బాబు అధ్యక్షతన అవాజ్ కమిటీ బృందం, ధర్నా చౌక్ సెంటర్ కి పోయి తమ సంపూర్ణ మద్దతును తెలియపరచిందని ఈ సందర్భంగా ఆవాజ్ నగర కమిటీ ఉపాధ్యక్షులు షేక్ నాసిర్ అహ్మద్ నగర కార్యదర్శి మహమ్మద్ షరీఫ్ లు మాట్లాడుతూ అంగన్వాడీలను జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన అన్యాయం చేస్తా ఉన్నాడని వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం వారి యొక్క సమస్యలను పట్టించుకోవడం లేదని దుమ్మెత్తి పోశారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడి వర్కర్స్ న్యాయమైన సమస్యలను పరిష్కారం చేస్తారని తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి ఇప్పుడు మంత్రివర్గం చర్చలకు పిలిచి ఒక్క రూపాయి కూడా అంగన్వాడీలకు పెంచామని చెప్పడం చాలా దారుణమని వారు అన్నారు. జగనన్న ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఆందోళన పోరాట లు చేస్తారని వారు హెచ్చరించారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో మీరు ఇచ్చిన హామీనే వారు అడుగుతున్నారని హామీని వెంటనే అమలు చేయాలని అవాజ్ కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. అంగన్వాడి ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని వారు ఘాటుగా విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాజుయూటీ చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. అంగన్వాడి ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని ఈ రకమైన పద్ధతే కనక పాటిస్తే రాబోవు కాలంలో అంగన్వాడి అక్క చెల్లెమ్మలు అందరూ కలిసి రాజకీయ సమాధి చేయడానికి మనమందరం వెనకాడకూడదని వారు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని లేదంటే అన్ని పార్టీలను విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ నగర నాయకులు అబ్దుల్ నయీమ్, ఇలియాజ్ ,సయ్యద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

➡️