ఆక్రోషం కనపడదా

Dec 20,2023 16:55 #Kurnool
knl anganwadi workers strike on 9th day a

ప్రజాశక్తి-ఆదోని :  న్యాయమైన సమస్యలు పరిష్కారం కొరకు శాంతియుతంగా చేస్తున్న అంగన్వాడీల ఆక్రోషం కనపడదా అంటూ సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఈరన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీ మేర‌కు అంగ‌న్‌వాడీల న్యాయ‌మైన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు బుధ‌వారం ఆదోనిలోని అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద స‌మ్మె శిబిరాన్ని చేరుకొని సంఘీభావం తెలిపారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ కాల‌యాప‌న చేయ‌కుండా ప్ర‌భుత్వం అంగ‌న్‌వాడీల‌కు ఇచ్చిన‌ హామీలను నెర‌వేర‌చాల‌న్నారు. రూ.26 వేల గౌరవ వేతనం ఇవ్వాలని త‌దిత‌ర న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్ర‌జ‌లు తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకురాలు పద్మ వరలక్ష్మి జానకి సిఐటియు నాయకులు గోపాల్ తిప్పన, సిపిఐ సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ వీరేష్ సిపిఐ పట్టణ మండల కార్యదర్శి సుదర్శన్ కల్లుబావిరాజు ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి వెంకన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శాబీర్ భాష, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొత్తూరు గంగన్న, బసపురం వీరన్న, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు ఈరన్న, ఏఐవైఎఫ్ నాయకులు రమేష్ అంజిత్ పాల్గొన్నారు.

➡️