సిపిఎం అభ్యర్థి గౌస్ దేశాయ్ ని గెలిపించండి

Apr 10,2024 16:51 #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే, సిపిఎం అభ్యర్థి గౌస్ దేశాయ్ కి మీ అమూల్యమైన ఓటు వేసి, వేయించి గెలిపించాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు, షేక్ మొహమ్మద్ షరీఫ్, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, కె.రాజగోపాల్, పార్టీ నగర కమిటీ సభ్యులు ఎస్.డి. కాజా పాషా, మహబూబ్ బాషా లు ప్రజలను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలపైన ఎటువంటి భారాలు వేసిన, మరుక్షణం స్పందించి, ధరలు తగ్గేదాకా, అది కలెక్టర్ ఆఫీసా, ఎమ్మార్వో ఆఫీస్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల, దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలబడే, పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఎం పార్టీ అని వారు కొనియాడారు. కాబట్టి అటువంటి నైతిక విలువలు కలిగిన, ప్రజా శ్రేయస్సు కోరి పోరాడే, సిపిఎం పార్టీ అభ్యర్థి డి.గౌస్ దేశాయ్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై మీ అమూల్యమైన, పవిత్రమైన, ఓటు వేసి, వేయించి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. మతోన్మాద బిజెపి, మన ఆంధ్ర రాష్ట్రానికి సర్వనాశనం చేసిందని, ప్రత్యేక హోదా , విభజన హామీలు, రాయలసీమ ప్యాకేజీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, లకు పంగనామాలు పెట్టి , ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, తుంగలో తొక్కిన బిజెపికి ఈరోజు వైసిపి, టిడిపి సిగ్గు లేకుండా బిజెపి, నరేంద్ర మోడీ పాదాల దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. వైసిపి టిడిపి, బిజెపిలకు రాజకీయంగా సమాధి కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇటువంటి మతోన్మాద, అవినీతి నిరంకుశ పార్టీలను గెలిపిస్తే, ప్రజల నడ్డి విరగొట్టడమే ,కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని, దేశాన్ని, అమ్మి పారేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని, వారు నిప్పులు చెరిగారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి, ప్రజా వ్యతిరేక విధానాలు, అవలంబిస్తున్నాయి అని ప్రజల పైన, నిత్యవసర వస్తువుల ధరలతో పాటు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి, పేద మధ్యతరగతి, ప్రజల నడ్డి విరగడతా ఉన్నారని, ఎటు చూసినా అభివృద్ధి పరంగా గాని, పారిశ్రామికంగా గాని, లేదా ఉపాధి పరంగా గాని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని, సంవత్సరానికి పుల్లయ్య కాలేజ్, సుబ్బారెడ్డి, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ ,కాలేజ్ లాంటి ఇంజనీరింగ్ కాలేజ్ ల నుండి వేల మంది, విద్యార్థులు యువతి, యువకులు బయటకు వస్తా ఉంటే, వారికి ఎటువంటి ఉపాధి అవకాశాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపలేకపోయాయని, అటువంటి, ప్రభుత్వాలు మనకు అవసరమా అని వారు ప్రజలను ప్రశ్నించారు ? కాబట్టి బిజెపి, వైసిపి, టిడిపిలకు భరతం పట్టి ,నిరంతరం అందుబాటులో ఉండే ,ప్రజల సమస్యల పరిష్కారం కోసం, పోరాడే ,డి.గౌస్ దేశాయ్ గారి సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుకు ఓటు వేసి , వేయించి గెలిపించి, భారీ మెజార్టీ చేకూర్చి, ప్రజా సమస్యల ,పరిష్కారం కోసం తోడ్పాటు అందించి ,ఆ రకంగా పేద, మధ్యతరగతి ప్రజల బలాన్ని చేకూర్చాలని వారు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాంబాబు, మద్దిలేటి శాలి , హాజీ భాష, నూర్ భాషా, బాబులి, బాబు, గౌస్ భాష, శక్షావలి, జావీద్, అర్షాద్ తదితరులు పాల్గొన్నారు.

➡️