సిపిఎంను గెలిపించండి

Apr 6,2024 15:57 #Kurnool

ప్రజా అనుకూల ప్రత్యామ్నాయ విధానాలకై : ఎం రాజశేఖర్

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : ప్రజా అనుకూల ప్రత్యామ్నాయ విధానాల కోసం సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని కర్నూలు సిపిఎం ఓల్డ్ టౌన్ కార్యదర్శి ఎం రాజశేఖర్ డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామన్న కోరారు. శనివారం కొత్తపేట సిపిఎం ఇన్చార్జి అనీఫ్ అధ్యక్షతన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి మాట్లాడుతూ 2014 నుండి అధికారంలో ఉన్న బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ధరలు తగ్గించేందుకు జీఎస్టీ చట్టం తెస్తున్నామని ప్రజలకు మాయమాటలు చెప్పి జీఎస్టీ చట్టం వచ్చాక నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటే విధంగా ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపిందని చివరకు పసిపిల్లలు తాగే పాల డబ్బా నుండి ప్రాణాలు నిలిపే మందులు ఆఖరుకు అంతిమ సంస్కారాలకు వాడే శవపేటికల వరకు పన్ను లు వేసిందే తప్ప ధరలు తగ్గించిన పాపాన పోలేదని ఇంటింటి ప్రచారంలో ప్రజలకు వివరించారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు ఎంత ఉండేవి మనకందరికీ తెలిసిన విషయమేనని అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు రెట్టింపు చేశాడని ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ ఉన్న ఉద్యోగాలు ఊడబీకి యువతను నట్టేట ముంచాడని, నరేంద్ర మోడీ రాజకీయ అధికారం కొరకు మతాన్ని అడ్డుపెట్టుకొని దేశాన్ని నిలువునా చీల్చడానికి ప్రయత్నిస్తున్నాడని ఆ ప్రయత్నాన్ని మనం తిప్పుకొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు ఇద్దరూ నరేంద్ర మోడీకి లెఫ్టు రైటుగా వ్యవహరిస్తున్నారని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగే దమ్ము ధైర్యం వీరికి లేదని ఇటువంటి నికృష్టులను, ప్రజా ద్రోహులను ఓటు అనే ఆయుధంతో ఇంటికి సాగనంపే రోజు వచ్చింది కనుక ఆలోచించి ఓటు వేయాలని నిరంతరం ప్రజా సమస్యలు తీసుకొని పనిచేసే, ప్రజా అనుకూల ప్రత్యామ్నాయ విధానాల కొరకు పాటుపడే సిపిఎంఅభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని ఒక కొత్త పరిశ్రమ ఈ పదేళ్ల కాలంలో నెలకొల్పిన దాఖలాలు లేవని కానీ నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి లు లక్షల కోట్లు అప్పులు మాత్రం చేస్తు ప్రజలపై పన్నుల భారాలు వేస్తూన్నారని ఇది ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు ఇంటింటి ప్రచారం సందర్భంగా కొత్తపేటలో అనేక ప్రాంతాలలో పారిశుద్ధ్య సమస్యలు ఎక్కడ వేసిన చెత్త అక్కడే రోజుల తరబడి ఉంటుందని దానివల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తక్షణమే కమీషనర్ జోక్యం చేసుకొని చెత్తాచెదారం లేకుండా వీధులను శుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నగర నాయకులు రాఘవేంద్ర, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

➡️