ఎస్‌ఎస్‌సి ఫలితాల్లో ‘శ్రీ చైతన్య’ విద్యార్థుల ప్రభంజనం

Apr 22,2024 16:50

596 మార్కులు సాధించిన విద్యార్థిని వాసవి ప్రియను అభినందిస్తున్న ఎజిఎం సురేష్‌, ఆర్‌.రామాంజనేయులు, డిస్ట్రిక్‌ కోఆర్డినేటర్‌ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్‌ మంజుల తదితరులు

ఎస్‌ఎస్‌సి ఫలితాల్లో ‘శ్రీ చైతన్య’ విద్యార్థుల ప్రభంజనం
ప్రజాశక్తి – కర్నూలు కలెక్టరేట్‌
పదవ తరగతి పరీక్ష ఫలితాలలో కర్నూలు జిల్లాలో వున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారని ఆ విద్యా సంస్థల ఉమ్మడి జిల్లా ఎజిఎం సురేష్‌ తెలిపారు. సోమవారం శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొత్తం 600 మార్కులకు గాను కర్నూలు జిల్లాలో అత్యధిక మార్కులు 596 ముగ్గురు విద్యార్థులు, 595 మార్కులు ఇద్దరు, 594 మార్కులు తొమ్మిది మంది , 593 మార్కులు ఐదుగురు, 592 మార్కులు ఇద్దరు, 591 మార్కులు నలుగురు, 590 మార్కులు తొమ్మిది మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. 590 పైన మార్కులు 34 మంది, 580 పైన మార్కులు 92 మంది, 570 పైన మార్కులు 173 మంది, 550 పైన 324 మంది మార్కులు సాధించారని చెప్పారు. ఇంతటి అద్భుతమైన ఫలితాలను సాధించడానికి కారణం ఉత్తమ క్రమ శిక్షణతో పాటు మారుతున్న విద్యా వ్యవస్థకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలను రూపొందించి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు కూడా సులువుగా అర్థమయ్యేటట్లు పాఠాలు బోధించడమేనని తెలిపారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను అభినందిస్తూ ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, కృషి చేసిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం 596 మార్కులు సాధించిన విద్యార్థిని వాసవి ప్రియను ఎజిఎం సురేష్‌, ఆర్‌.రామాంజనేయులు, డిస్ట్రిక్‌ కోఆర్డినేటర్‌ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్‌ మంజుల అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గన్నారు.

➡️