రారండోరు వేడుకచూద్దాం

ప్రజాశక్తి – ఒంటిమిట్టబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట విద్యుత్‌ దీపాలతో, ఆకాశమంత పందిళ్లతో కళకళలాడుతోంది. ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుంచి స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు యాత్రికులు ఒంటిమిట్ట చేరుకున్నారు. కల్యాణశోభను ఒంటిమిట్ట సంతరించుకుంది. రామనామ స్మరణతో ఏకశిలానగరం మారుమ్రోగుతోంది. పోలీసుల బందోబస్తుతో ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు నూతన శోభను సంతరించుకుంది. ఏకశిలానగరిలో సోమవారం రాత్రి నిర్వహించనున్న సీతారాముల కల్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు కల్యా ణోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీకోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట కోదండ రామాలయం విద్యుత్‌ దీపపు ధగధగలతో దేదిప్యమానంగా ముస్తాబైంది. నబూతో నభవిష్యతి అనేరీతిలో విద్యుత్‌ కాంతుల మధ్య ఆకాశమంత చలువపందిళ్లతో కళకళ లాడుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి జగదబిరాముని కల్యాణాన్ని తిలకిం చడానికి భక్తులు, యాత్రికులు, సేవకులు ఒంటిమిట్టకు చేరుకున్నారు. జగదభిరాముని ఆలయంలోని దత్తమం డపం, ధ్వజస్తంభం, కల్యాణవేదిక విద్యుత్‌ కాంతులతో కల్యాణశోభను సంతరించుకుంది. టిటిడి అధికారులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో రానుండడంతో నూతనశోభ చోటు చేసుకుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజునాటికి కల్యాణ ఘడియలు సమీపించడంతో పలువురు భక్తులు, పర్యాటకులు, యాత్రికులు, సేవకులు కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు ఎదురు చూస్తున్నారు. ఒంటిమిట్ట గ్రామ శివారులోని కల్యాణ వేదిక, దత్తమండపం, కోదండ రామాలయం విద్యుత్‌ కాంతులతో శోభాయమానంగా ప్రకాశిస్తోంది. ఎలాంటి అవాంఛ నీయమైన ఘటనలు చోటుచేసు కోకుండా పోలీసులు అడుగడుగునా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గతానికి భిన్నంగా భారీఎత్తున ప్రత్యేక బారీకేడ్లను ఏర్పాటు చేశారు. కల్యా ణోత్సవాన్ని జయప్రదం చేయడానికి పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లను చేయడం గమనార్హం. సోమవారం రాత్రి చంద్రుని వెన్నెల్లో జరిగే కల్యాణో త్సవానికి పలువురు దాతలు అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సీతారాముల కల్యాణం అనంతరం టిటిడి యంత్రాంగం లక్షలాది మందికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేసింది.కల్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పణఒంటిమిట్టలో సోమవారం జరగనున్న శ్రీ సీతా రాముల కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను ఆదివారం సమర్పించారు. 180 కిలోల బరువైన ఈ తలంబ్రాలను ఆలయం వద్ద డెప్యూటీ ఇఒ నటేష్‌ బాబు, అర్చకులు శ్రావణ్‌ కుమార్‌ సమక్షంలో అందించారు. ఈ తలంబ్రాల కోసం ఆరు నెలల పాటు వరిని ప్రత్యేకంగా పండించి నాలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎంతో భక్తిభావంతో మూడు నెలల పాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారు. ఈ సంఘం ఆధ్వర్యంలో 13 ఏళ్లుగా భద్రాద్రి రామునికి, ఏడేళ్లుగా ఒంటిమిట్ట రామునికి కల్యా ణోత్సవం అందజేస్తున్నామని శ్రీకళ్యాణ అప్పారావు తెలిపారు.గరుడ వాహనంపై సీతాపతిఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహన సేవ 9 గంటల వరకు నిర్వహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హార తులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం మోహినీ అలంకారంలో శ్రీరాముడు దర్శన మిచ్చారు. ఉదయం 7.30 నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్‌, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవా యిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలా హలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు ఊంజలుసేవ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇఒ నటేష్‌బాబు, సూపరింటెండెంట్లు హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌, యాత్రికులు పాల్గొన్నారు.ట్రాఫిక్‌ మళ్లింపు : ఎస్‌పికడప అర్బన్‌ : శ్రీసీతారాముల కల్యాణం నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప నగరంలో, ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని ఎస్‌పి సిద్ధార్థ్‌కౌశల్‌ ఒక ప్రకటన పేర్కొన్నారు. ఈ నెల 22న ఉదయం 6 గంటల నుంచి అమలులో ఉంటుందని తెలిపారు. భక్తుల వాహనాలు మినహా ఎలాంటి ఇతర వాహనాలు అనుమ తించరని పేర్కొన్నారు. వాహనాల దారి మళ్లింపు వివరాలు కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు అలంఖాన్‌పల్లి ఇర్కాన్‌ జంక్షన్‌ నుంచి ఊటుకూరు సర్కిల్‌, రాయచోటి మీదుగా తిరుపతి వెళ్లాలని తెలిపారు. తిరుపతి నుంచి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రేణిగుంట నుంచి దారి మళ్లింపు వయా రాయచోటి మీదుగా కడపకు చేరుకోవాలని పేర్కొన్నారు. రాజంపేట వైపు నుంచి వెళ్లే భారీ వాహనాలను రాయచోటి మీదుగా దారి మళ్లించినట్లు తెలిపారు. రాజంపేట వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు సాలాబాద్‌ నుంచి ఇబ్రహీం పేట, మాధవరం మీదుగా దారి మళ్లించి నట్లు పేర్కొన్నారు. రాజంపేట వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలను సాలాబాద్‌ సమీపంలో 5 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రదేశాల్లో క్రమపద్ధతిలో నిలపాలని తెలిపారు. కల్యాణ వేదిక నుంచి కడప మార్గంలో 10 పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

➡️