విభిన్న ప్రతిభావంతులకు చేయూతను అందిద్దాం

ప్రజాశక్తి – రాయచోటి విభిన్న ప్రతిభావంతులకు చేయూత నందించాలని, వారిని ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారి శివ ప్రకాష్‌ రెడ్డి తెలిపారు. సోమవారం బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా సమ్మిళిత విద్య సమన్వయకర్త జనార్ధన్‌ ఆధ్వర్యంలో 6 నుండి 18 సంవత్సరాలలోపు విభిన్న ప్రతిభావంతుల విద్యా ర్థులకు ఉచిత పరికరాల పంపిణీ కోసం నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి, సుండుపల్లె, వీరబల్లి, రామాపురం, సంబేపల్లి ,చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె మండలాలలోని దాదా పుగా వందమంది పైగా విభిన్న ప్రతి భావంతుల పిల్లలకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని చెప్పారు. నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకున్న ప్రతి పిల్లవానికి అవసరమయ్యే వీల్‌ చైర్‌, సిపి చైర్‌, ట్రై సైకిల్‌, వినికిడి యంత్రాలు, రోలేటర్స్‌ ఇతరంతర పరికరాలను ఉచితంగా అందజేస్తామని పేర్కొ న్నారు. ప్రతి మండలంలోనూ విభిన్న ప్రతిభా వంతుల పిల్లలకు ప్రత్యేక విద్యను అందించేందుకు భవిత కేంద్రాలు ఉన్నాయని, ఈ కేంద్రాలలో ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ఫిజియో థెరపిస్టుతోపాటు పిల్లలకు అన్ని సౌకర్యాలు ఉంటాయని వివరించారు. కావున పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను భవిత కేంద్రాల్లో చేర్పించాలని వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. నిర్ధారణ శిబిరంలో ఇఎన్‌టి వైద్యులు ఎ.ఆర్‌. నరసింహారావు, ఆర్థో వైద్యులు రాజ అహ్మద్‌, ఆడియాలజిస్ట్‌ త్రిలోక్య, జనరల్‌ వైద్యులు రామ రాజు, ఫిజియోథెరపిస్ట్‌ రమేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️