వినుకొండలో లారీ ఓనర్ల నిరసన

Apr 20,2024 00:34

ప్రజాశక్తి – వినుకొండ : ధరలు పెంచేందుకు పలుమార్లు మిల్లర్స్‌కు విజ్ఞప్తులు చేశామని మిల్లర్స్‌ ముందుకు రాకపోవడంతో లారీలను నిలిపివేసామని లారీ ఓటర్లు స్పష్టం చేశారు. లారీల నిర్వహణకు తమకు గిట్టుబాటు కావడం లేదని స్థానిక బాలాజీ లారీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు శుక్రవారం నిరసనకు దిగారు. వినుకొండ పట్టణం మార్కాపురం రోడ్‌లోని లారీ యూనియన్‌ ఆఫీస్‌ వద్ద వినుకొండ లారీ యూనియన్‌ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 14వ తేదీ నుంచి తమ ట్రాన్స్‌పోర్ట్‌ నుంచి లారీలు నిలిపివేశామని తెలిపారు. పెరిగిన డీజిల్‌, టోల్‌ టాక్స్‌, వివిధ పన్నులు, డ్రైవర్లు, క్లీనర్లకుజీతాలు పెరగడం వల్ల తాము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. మార్కెట్లో అన్ని ధరలూ పెరిగినా లారీల బాడుగలు మాత్రం పెరగలేదని, మిల్లర్స్‌తో గత మూడేళ్లుగా ఒప్పందంలో ఉన్న తమ యూనియన్‌ కరోనా సమయంలోను ఒప్పందం ప్రకారం ధరలు పెరిగినప్పటికీ లారీలు నడిపామని అన్నారు. ప్రస్తుతం ఆ భారాన్ని మోయలేక లారీలు నిలిపివేసినట్లు తెలిపారు. మిల్లర్స్‌ త్వరగా స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎ.వెంకట్రావు సెక్రటరీ ఎస్కే హుస్సేన్‌వలి, ఓనర్స్‌ చంద్రశేఖర్‌ అనంతరా మిరెడ్డి, నాని, పేరయ్య, సత్యనారాయణ, రఫీ, సుభాని, నాగుల్‌ మీరా, శ్రీను, మస్తాన్‌వలి, మాధవ రాజు, వెంకటేశ్వర్లు, బాష, కరిముల్లా, సుభాని, మీరావలి పాల్గొన్నారు.

➡️