ఎప్పటిలాగే ఆదరించండి : రాజన్నదొర

May 11,2024 21:25

ప్రజాశక్తి – మక్కువ :  నాలుగు దఫాలుగా నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటూ వస్తున్న నా మండల ప్రజలంతా ఈసారి కూడా వెన్నుదన్నుగా నిలిచి అత్యధిక మెజార్టీ తీసుకురావాలని ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసిపి మండల నాయకులు మావుడి రంగునాయుడు జడ్పిటిసి సభ్యులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మక్కువలో శనివారం ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో రాజన్నదొర మండలంలో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీకి అధిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా మజ్జి గౌరమ్మ గుడి నుండి ప్రారంభమైన ప్రచార ర్యాలీ ప్రధాని రహదారి గుండా మార్కెట్‌ వీధి నుండి అన్ని వీధుల్లో కొనసాగింది. అనంతరం రాజన్నదొర మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజారంజకంగా వైసిపి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందిందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం జగన్మోహన్‌ రెడ్డిని మళ్లీ సిఎంగా చూడాలనుకుంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి తనను, ఎంపి అభ్యర్థి తనుజరాణిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

➡️