అంగన్వాడీలకు ఆత్మీయ విందు

Jan 17,2024 21:27

ప్రజాశక్తి-కురుపాం : అంగన్వాడీల సమస్యలపై 37 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఎఎంసి మాజీ చైర్మన్‌ కోలా రంజిత్‌ కుమార్‌ అన్నారు. బుధవారం అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి, సంఘీభావం తెలిపారు. మధ్యాహ్నం వారికి విందు భోజనం ఏర్పాటు చేశారు. పండగలను సైతం లెక్క చేయకుండా కుటుంబ సభ్యులను విడిచిపెట్టి పోరాటం చేస్తున్న అంగన్వాడీల పోరాట పటిమను ఆయన కొనియాడారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ కె.వి.కొండయ్య, జనసేన పార్టీ నాయకులు ఎన్‌.వంశీ, టిడిపి నాయకులు బోటు గౌరీ, లైలా, చంటి, గవరయ్య, మురళి, రాజు, గంగులు, త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️